గాంధీ జయంతి 2020 : మహాత్ముని సందేశాలు, సూక్తులు అందరికీ స్ఫూర్తిదాయకం...

 బాపూజీ తన జీవితంతో పాటు మన జీవితానికి సంబంధించి కొన్ని మంచి విషయాలతో పాటు సేవాగుణాన్ని అలవరచుకుని.. సత్యమార్గం దిశగా పయనించేందుకు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నో సూక్తులు.. సందేశాలను చెప్పారు.


కేవలం బోధనలతోనే కాకుండా ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇలా మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి కేవలం శాంతియుతంగా పోరాడారు. తనతో పాటు ఇతర నాయకులకు కలుపుకుని.. అందరి సహాయంతో తెల్లదొరలను వారి దేశాలను తరమి కొట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన శాంతియుత, ప్రేరణాత్మకమై, స్ఫూర్తినిచ్చే సందేశాలను, సూక్తులను ఓసారి స్మరించుకుందాం...

పుస్తకం గొప్పతనం..

పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు.. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.

నడవడికలో మాత్రమే..

అందం అనేది ఆడంబరాలలో ఉండదు..

అది కేవలం నడవడికలో మాత్రమే ఉంటుంది..

సర్వస్వం కోల్పోయినట్టే..

ఏ వ్యక్తి అయితే వ్యక్తిత్వం కోల్పోతారో..

వారు తన సర్వస్వం కోల్పోయినట్టే..

మేధావుల మాటలు..

మేధావులు మాట్లాడతారు..

మూర్ఖులు మాత్రమే వాదిస్తారు..

ఎండమావిలో నీటిని..

సాధన లేకుండా విజయాన్ని కోరుకోవాలంటే..

ఎండమావిలో నీటిని ఆశించడమే..

అజ్ణానాన్ని తొలగిస్తుంది..

అన్నదానం ఆకలిని తీరుస్తుంది..

అదే అక్షరదానం అజ్ణానాన్ని తొలగిస్తుంది..

ఎదుటివారిలా బతకాలి అనుకుంటే..

మనం బతకడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు..

కానీ ఎప్పుడైతే మనం ఎదుటివారిలా బతకాలి అనుకుంటామో..

అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది..

ఎదురుదెబ్బలు తగిలినప్పుడే..

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడే..

మనం కొత్త విషయాలను నేర్చుకుంటాం..

శాశ్వతంగా కావాలంటే..

ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమే..

శాశ్వతంగా కావాలంటే మనం కష్టపడాలి..

అప్పుడే అది మన వద్ద ఉంటుంది.

నువ్వే నాంది పలకాలి..

ఈ విశ్వంలో నువ్వు ఏ మార్పు కోరుకుంటావో..

అందుకు ముందు నువ్వే నాంది పలకాలి..

శాశ్వతంగా నిలిచి ఉంటుంది..

మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది..

ఇతరుల కోసం చేసేది మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది..

ఉన్నత శిఖరాలను..

విద్యలో సంతోషాన్ని పొందితే..

జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటావు..

కోరికలను మాత్రం..

ఈ విశ్వం మనిషి అవసరాలను తీర్చగలదు..

కానీ కోరికలను మాత్రం ఎప్పటికీ తీర్చలేదు..

Read Also

© Copyright Post
❤️ Thanks for Visit ❤️

Popular Posts

Kuttymovies 2020 - Kuttymovies HD Tamil Movies Download - Kuttymovies

Bolly4u.org—bolly4u - bolly4u.tread - bolly4u.cc - 300Mb Dual Audio movies Worldfree4u - 9xmovies - World4ufree - Khatrimaza Free Movies

NEET Result 2020 Name Wise (Released) NTA NEET UG Result September 2020 By Name Wise’ Cut Off’ Merit List At Ntaneet.Nic.In